నాలుగు రోజుల్లో కోట్లు
‘పుష్ప-2 ది రూల్ ’ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఐదో రోజుతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన గ్రాస్ కలెక్షన్లు రూ. ౮౭౦ కోట్లకు చేరినట్టు తెలుస్తోంది. అయితే నాలుగో రోజు నాటికి వచ్చిన వసూళ్లను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రూ.829 కోట్లు వసూలైనట్టు వెల్లడించారు. నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా ‘పుష్ప-2’ రికార్డ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్‌లో నాలుగో రోజు ఒక్క రోజే రూ.86 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఏ హిందీ చిత్రం కూడా సింగిల్ డేలో 86 కోట్ల నెట్‌ను సాధించలేదు. హిందీలో నాలుగు రోజుల్లో రూ.291 కోట్లు వసూలు చేసింది. మైత్రీ మూవీమేకర్స్.. సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ‘పుష్ప 2’ను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం ప్రీమియర్స్ నుంచే మంచి విజయా న్ని అందుకుంది.






