ప్రభాస్ కోసం రిషబ్ కథ!
టాలీవుడ్‌లో ఆసక్తికర వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ కోసం దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి కథను సిద్ధం చేస్తున్నారట. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌తో ప్రభాస్ మూడు సినిమాలు చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ మూడు సినిమాలలో ఒకదానికి రిషబ్ శెట్టి కథను అందించనున్నారట. రిషబ్ కూడా స్క్రిప్ట్ ఇస్తానని చెప్పారట. కేవలం కథను అందించడం వరకే ఆయన పని.. దర్శకత్వం మాత్రం వేరొకరు వహిస్తారట. రిషబ్‌కి హోంబలే ఫిల్మ్స్‌తో మంచి అనుబంధం ఉంది. ఈ ఇద్దరి కాంబోలో ‘కాంతార’ వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్ రూపొందుతోంది. ఈ క్రమంలోనే రిషబ్, హోంబలే సంస్థకు మధ్య ప్రభాస్ సినిమా కథ విషయమై చర్చ జరిగిందని సమాచారం. రిషబ్ ఒక లైన్‌ను వివరించారట. దీనికి ప్రభాస్ కూడా సంతోషించారట. ఈ కథ మునుపెన్నడూ మనం వినని విధంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రభాస్ కూడా ప్రస్తుతం ఓ ఛాలెంజింగ్ పాత్ర కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్.. ‘ఫౌజీ’, ‘రాజాసాబ్’, ‘సలార్ 2’ చిత్రాల్లో నటిస్తున్నారు.






