17-02-2026 12:00:00 AM
మేళ్లచెరువు, ఫిబ్రవరి 16: మహాశివరాత్రి సందర్భంగా స్థానిక శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండవ రోజైన సోమవారం స్వామివారి దర్శనం కోసం భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం సుప్రభాతం, రుద్రాబి భిషేకాలు,అవపాసన బలిహరణ, పుష్పాలంకరణ, మహా నివేదన, పూజాది కార్యక్రమాలు అర్చకులు ఘనంగా నిర్వహించారు.
రాత్రి వేళలో భజన కోలాటాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా స్వామివారిని ప్రముఖ చలనచిత్ర దర్శకులు బోయపాటి శ్రీను,నల్గొండ పార్లమెంటు సభ్యుడు కె రఘువీర్ రెడ్డి,ఐరా రియాల్టీ చైర్మన్ పోశం నర్సిరెడ్డి, తదితరులు స్వామివారిని దర్శించుకుని, ఎద్దుల పందాల పోటీలను ప్రారంభించి,కొద్దిసేపు పందాలను తిలకించారు
ఎద్దుల పందాలలో రెండు పండ్ల విభాగం, పాల పండ్ల విభాగం, నాలుగు పండ్ల విభాగం,ఆరు పండ్ల విభాగాలు చెందిన గిత్తలు పాల్గొన్నాయి. రాష్ట్రస్థాయి ఎద్దుల పందాలు తిలకించడానికి దూర ప్రాంతాల నుండి ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమాలలో ఉత్సవ కమిటీ చైర్మన్ పెండ్లి లచ్చయ్య ఈవో నాగేళ్ళ శంబి రెడ్డి పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.