calender_icon.png 17 February, 2026 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లంపేట చైర్‌పర్సన్‌గా శ్రీదేవి

17-02-2026 12:00:00 AM

  1. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు మేడ్చల్ ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి కృతజ్ఞతలు
  2. బీజేపీ మద్దతుతోనే ఎల్లంపేట్ మున్సిపల్‌ను బీఆర్‌ఎస్ పార్టీ కైవసం

మేడ్చల్ అర్బన్, జనవరి 16 (విజయక్రాంతి):ఎల్లంపేట్ మున్సిపల్ చైర్ పర్సన్ గా బి ఆర్ ఎస్ కు చెందిన లావుడ్య శ్రీదేవి నాయక్ ఎన్నికయ్యారు. మున్సిపల్ లో మొత్తం 24 వార్డులు ఉండగా  చైర్ పర్సన్ పదవికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 13 కాగా,బీఆర్‌ఎస్ పార్టీ 12 స్థానాలతో ఒక ఓటు తక్కువలో నిలిచింది.కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు,బీజేపీ 4 సీట్లు సాధించాయి.చైర్ పర్సన్ ఎన్నికల్లో బిజెపి కౌన్సిలర్ లు కీలకమైనారు.

బీజేపీ సభ్యులు బీఆర్‌ఎస్కు మద్దతు ప్రకటించడంతో బీఆర్‌ఎస్కు అవసరమైన మెజార్టీ లభించింది.దీంతో ఎల్లంపేట్ మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని బిజెపి సభ్యుల మద్దతుతో బీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.బీఆర్‌ఎస్ తరఫున 8వ వార్డు కౌన్సిలర్ లావుడ్య శ్రీదేవి చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు.మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా బీజేపీకి చెందిన 19వ వార్డు కౌన్సిలర్  మేకల రజిత దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పదవికి మేకల రజిత పేరును నరసింహ ప్రతిపాదించగా,బిందెల కుమార్ మద్దతు తెలిపారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు సమావేశం నుండి వాకౌట్ చేశారు.మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి బీఆర్‌ఎస్ అభ్యర్థి లావుడ్య శ్రీదేవి పేరును చిన్నోళ్ల భాస్కర్ ప్రతిపాదించగా,సద్ది నిశిత రెడ్డి మద్దతు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ తరఫున శాంతి lపేరును సారాల ముత్యాలు గౌడ్ ప్రతిపాదించగా వేణు గౌడ్ ఆమెకు మద్దతు  ఇచ్చారు.ఎల్లంపేట్ మున్సిపల్ చైర్ పర్సన్ ఓటింగ్లో శ్రీదేవికి 17 మంది మద్దతు లభించగా,కాంగ్రెస్ పార్టీ సభ్యులు శాంతికి 8 మంది మద్దతు లభించింది.మొత్తం ఎక్స్-అఫీషియో ఓట్లు కలుపుకొని 26 మంది సభ్యులు ఉండగా,సమావేశానికి 25 మంది హాజరయ్యారు.

ఎన్నికల అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎల్లంపేట్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన బిజెపి అభ్యర్థులు నలుగురు గెలుపొందగా బిఆర్‌ఎస్ మద్దతుతో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పదవిని మేకల రజిత దేవేందర్ రెడ్డికి ఇవ్వడంలో మల్కాజిగిరి బిజెపి పార్లమెంటు సభ్యులు  ఈటల రాజేందర్ కృషి ఎంతో ఉందని ఆయన కొనియాడారు.

అనంతరం ఎల్లంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గా నియమి తులైన లావుడియా శ్రీదేవితో పాటు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి లకు ఎన్నికల అధికారి చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారోత్సవంలో నియామక పత్రాన్ని అందజేశారు. 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్ తో పాటు ఏసిపి శంకర్ రెడ్డి,సిఐ సత్యనారాయణ మున్సిపల్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.