యాదాద్రి ఆలయ సన్నిధిలో భక్తుల రద్దీ
యాదాద్రి భువనగిరి, మే 27 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామివారి సన్నిధిలో సోమవారం భక్తుల రద్దీతో ఆలయం కిటకిట లాడింది. వేసవి సెలవుల కారణంగా స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజల కోసం నిత్యం తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నా రు. సోమవారం ప్రధానాలయంలో నిత్య పూజలు ఘనంగా జరిగాయి. ఉత్సవ మండపంలో స్వామివారి నిత్య హోమం, కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొండపైన పర్వ త వర్ధనీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో అభిషేకాలు, బిల్వార్చన జరిపారు. స్పటిక లింగానికి ప్రత్యేక అభిషేకం, అర్చనలు నిర్వహించారు. స్వామివారికి సోమవారం భక్తుల నుంచి రూ. 62,67,807 ఆదాయం సమకూరినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్‌రావు తెలిపారు.
ప్రత్యేక ఏర్పాట్ల పరిశీలన
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వేసవి సెలవుల కారణంగా వారాంతాల్లో పెరుగుతున్న భక్తుల తాకిడి దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లపై ఆలయ అధికారులు దృష్టి సారించారు. సోమవారం ఆలయ ఈవో భాస్కర్ రావు, ఈఈ దయాకర్‌రెడ్డి, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవో శ్రవణ్‌కుమార్ బృందం కొండపై దర్శన క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు గాలి, వెలుతురు ఆడే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను పరిశీలించారు. భక్తులు ఆలయం నుంచి బయటకు వెళ్లేదారిలో ప్రసాదాల విక్రయాల వలన రద్దీ ఏర్పడి తొక్కిసలాట జరుగుతున్నదనే విమర్శలు వస్తున్నందున అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. శివాల యం ఎదురుగా మహిళలకు 3కౌంటర్లు, పురుషులకు 3 కౌంటర్లు, ఏర్పాటు చేశారు. శని, ఆదివారాల్లో భక్తుల సౌకర్యార్థం కొండ పై బస్టాండ్ వద్ద ప్రసాదాల కౌంటర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.






