పిచ్చి కుక్క స్వైర విహారం
రామచంద్రాపురం, మే 27 : పిచ్చి కుక్క రెచ్చిపోయి సుమారు 20మందిని గాయర్చి న ఘటన రామచంద్రాపురం మండలంలోని తెల్లాపూర్ మున్సిపల్‌లో చోటు చేసు కుంది. బాధితులు కథనం మేరకు.. ఆదివా రం రాత్రి పది గంటలకు ఒక పిచ్చికుక్క దారిన వెళ్తున్న వారిని వెనుక నుంచి వెళ్లి కరిచింది. అర్ధరాత్రి వరకు సుమారు 10 మంది ఈ పిచ్చికుక్క దాడిలో గాయపడ్డారు. సోమవారం ఉదయం పూట మార్నింగ్ వాకింగ్ వెళ్తున్న వారిపై కూడా దాడి చేసి గాయ పరిచింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ సిబ్బంది పిచ్చికుక్కను పట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.
అయినా ఆ కుక్కను పట్టుకోలేకపోయారు. గాయపడిన వారిలో శకుంతల అనే మహిళకు తీవ్రగాయాలు కావడంతో ఉస్మానియా దవాఖానకు తరలించారు. మిగతవారు పటాన్‌చెరు, రామ చంద్రాపురం, శేరిలింగంపల్లి ప్రభుత్వ దవాఖానలో చికిత్స తీసుకున్నారు. పిచ్చికుక్క దాడితో తెల్లాపూర్ గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భయటకు వెళ్లాలంటే చేతిలో కర్రలతో వెళ్తున్నారు. కుక్కలను అదుపుచేయలేకపోతున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






