సురక్షిత ప్రయాణం కోసం మై ఆటో ఈజ్ సేఫ్
ఎస్పీ చెన్నూర్ రూపేశ్
సంగారెడ్డి, మే 27 (విజయక్రాంతి) : ప్రజ లు సురక్షితంగా ఆటోలో ప్రయాణం చేసేందుకు పోలీసు శాఖ ‘మై ఆటో ఈజ్ సేఫ్’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్పీ చెన్నూరు రూపేష్ తెలిపారు. సోమవారం సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ వద్ద మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. మహిళలకు భద్ర త కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. సంగారెడ్డి, పటాన్‌చెరు, నారాయణఖేడ్, జహీరాబాద్ పోలీసు సబ్ డివిజన్‌లో 2000 ఆటోలకు (ఆటో ముం దు, వెనుక, డ్రైవరు సీట్ వెనుకాల) ప్రయాణికులకు కనిపించేలా స్టిక్కరింగ్ ఏర్పాటు చేశామన్నారు.
జిల్లాలో ఉన్న ప్రతి ఆటోకు స్టిక్కరింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయాణికులు ఎవరైన ఆటోలో ప్రయాణిస్తున్న ప్పుడు ఆటో డ్రైవరు అసభ్యంగా ప్రవర్తించి న, దురుసుగా మాట్లాడిన, ఇతర సమస్యలు సృష్టించిన ఆటో డ్రైవర్ సీట్ వెనుకల ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే ఆటో డ్రైవరుకు సంబంధించిన సమాచారం మీ మొబైల్‌లో కనిపిస్తుందన్నారు. స్క్రీన్ షాట్ తీసుకొని ఫిర్యాదు చేసిన వెంటనే షీ టీం ఎమర్జెన్సీ రేట్ యువర్ ఆటో అను ఆప్షన్ కనిపిస్తుందన్నారు. మీకు తలెత్తిన సమస్యను కనిపించిన ఆప్షన్స్ ఎంచుకోని వివరాలు నమోదు చేసిన వెంటనే కంట్రోల్ రూంకు చేరుతుందని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు.






