ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ రామకృష్ణారావు
- 36 మంది డీఎస్పీలు బదిలీ
- ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖలో కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 12 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, రామగుండం పోలీసు కమిషనరేట్లతో పాటు సీఐడీ, ఏసీబీ, ఇంటెలిజెన్స్, రైల్వే పోలీసు విభాగాల్లో కీలక పోస్టుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
పరిపాలనా అవసరాలకు అనుగుణంగా ఈ బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. వరంగల్ పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్న సన్‌ప్రీత్ సింగ్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఆయనకు అదనంగా డీజీ జోన్--3 (రాజన్న) బాధ్యతలు కూడా అప్పగించారు. హైదరాబాద్ సిటీ నార్త్ జోన్ (లా అండ్ ఆర్డర్) జాయింట్ కమిషనర్‌గా ఉన్న ఎన్ స్వేతను వరంగల్ పోలీసు కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
ఆమెకు డీజీ జోన్--4 (భద్రాద్రి) అదనపు బాధ్యతలు కూడా కేటాయించారు. రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకు డీఐజీ జోన్--1 (కాళేశ్వరం) అదనపు బాధ్యతలు అప్పగించగా, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డీ జోయెల్ డేవిస్‌కు డీజీ జోన్--5 (యాదాద్రి) బాధ్యతలను అదనంగా అప్పగించారు. సీఐ సెల్ ఇంటెలిజెన్స్ డీఐజీ ఆర్ భాస్కరన్‌కు డీఐజీ జోన్--2 (బాసర) బాధ్యతలు కేటాయించారు.
స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఎస్‌ఎం విజయ్ కుమార్‌కు హైదరాబాద్ నార్త్ రేంజ్ లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక ఏసీబీ జాయింట్ డైరెక్టర్ చెన్నూరి సింధు శర్మను సీఐ సెల్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ చేయగా, వై సాయి శేఖర్‌ను రైల్వే ఎస్పీగా నియమించారు. హైదరాబాద్ సిటీ డీసీపీ(ఎస్‌ఎం అండ్ టీ) చెర్నూరి రూపేష్‌ను సీఐడీ ఎస్పీగా బదిలీ చేశారు.
ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్‌ను కూడా సీఐడీ ఎస్పీగా నియమించారు. అలాగే పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఆర్ వెంకటేశ్వర్లును హైదరాబాద్ సిటీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీగా నియమించారు. వనపర్తి అదనపు ఎస్పీ (అడ్మిన్) రాజేష్ మీనాను అదే హోదాలో వికారాబాద్‌కు బదిలీ చేసింది.
36 మంది డీఎస్పీలు బదిలీ
36 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. గత కొంతకాలంగా పోస్టింగ్స్ కోసం వెయిటింగ్‌లో 28 మంది సివిల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు.
బదిలీ అయిన అధికారులు కొత్త పోస్టింగులు
పీ సృషిలం ఏసీపీ, సీసీఎస్, నిజామాబాద్
సంకెళ్ల వెంకటేష్ డీఎస్పీ, సీఐడీ
కంప రవీందర్ ఏసీపీ, సీసీఎస్, రామగుండం
సీ విజయ్‌రాజు డీఎస్పీ, పీసీఎస్ అండ్ ఎస్, చీఫ్ ఆఫీస్
జీ వెంకటేశ్వర్లు డీఎస్పీ, ఎస్బీ, సిరిసిల్ల
బొబ్బాల ప్రవీణ్ డీఎస్పీ, ఇంటెలిజెన్స్
బూర శ్రీనివాస్ డీఎస్పీ, రోడ్ సేఫ్టీ (నార్త్ జోన్)
ఎం వెంకట్‌నరసయ్య డీఎస్పీ, డీసీఆర్బీ, ఫంక్షనల్ వర్టికల్స్, ఆదిలాబాద్
జీ మహేందర్‌రెడ్డి డీఎస్పీ, ఏసీబీ
గొర్ల సీతారెడ్డి డీఎస్పీ, వీఅండ్‌ఈ
బీ బాలాజీ ఏసీపీ, టాస్క్‌ఫోర్స్, సిద్దిపేట
అడప నరసింహారావు ఏసీపీ, సీసీఆర్బీ, ఖమ్మం
ఎం వెంకట రామయ్య డీఎస్పీ, రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ బాసర
పబ్బతి వెంకటేశ్వర్లు డీఎస్పీ, సీఐడీ
కీత రామకృష్ణ ఏసీపీ, సీఎస్‌డబ్ల్యూ, హైదరాబాద్ సిటీ (ఫ్యూచర్ సిటీకి అటాచ్)
కొస్గి భాస్కర్ డీఎస్పీ, డీసీఆర్బీ, ఫంక్షనల్ వర్టికల్స్, రాజన్న సిరిసిల్ల
పీ కరుణాకర్‌రెడ్డి ఏసీపీ, ఎస్బీ, హైదరాబాద్ సిటీ
ఎం వెంకట్‌రెడ్డి డీఎస్పీ, ఇంటెలిజెన్స్
పార రాజు డీఎస్పీ, టీజీ సీఎస్బీ
నూనె వెంకటేశ్వర్లు డీఎస్పీ, వీఅండ్‌ఈ
జీ గోవర్ధనగిరి ఏసీపీ, ఎస్బీ, హైదరాబాద్ సిటీ
ఎస్ వెంకటేష్ ఏసీపీ, క్రైమ్స్, సైబరాబాద్
బీ గురునాయుడు ఏసీపీ, సీసీఆర్బీ , ఫంక్షనల్ వర్టికల్స్, నిజామాబాద్
భూపతి గట్టుమల్లు డీఎస్పీ, డీసీఆర్బీ, ఫంక్షనల్ వర్టికల్స్, కామారెడ్డి
బీ హరినాథ్‌బాబు ఏసీపీ, సీటీసీ, ఖమ్మం
చిలుక రాజిరెడ్డి డీఎస్పీ, సీఐడీ
ఆర్ నరేందర్ ఏసీపీ, టాస్క్‌ఫోర్స్, నిజామాబాద్
ఆవుల రాజయ్య డీఎస్పీ, ఇంటెలిజెన్స్
బొలగాని శ్రీనివాసరావు ఏసీపీ, టాస్క్‌ఫోర్స్, రామగుండం
ఏ పెద్దన్నకుమార్ డీఎస్పీ, పీటీసీ, అంబర్‌పేట్
తోటిచర్ల స్వామి ఏసీపీ, సీసీఆర్బీ, ఫంక్షనల్ వర్టికల్స్, కరీంనగర్
టీ ప్రవీణ్‌కుమార్ ఏసీపీ, సీసీఎస్, రామగుండం
కే పురుషోత్తం ఏసీపీ, ఎస్బీ, సైబరాబాద్
సర్ల రాజు ఏసీపీ, సీసీఎస్ అండ్ డీడీ, హైదరాబాద్ సిటీ
గడ్డం సదయ్య/సదన్‌కుమార్ ఏసీపీ, సీసీఎస్, సిద్దిపేట
ఎం రాజేష్ డీఎస్పీ, ఏసీబీ






