సంజూ ధనాధన్
చెన్నైకి మరో విజయం
ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తు
సీఎస్కే ఆల్‌రౌండ్ షో
ఐపీఎల్ 19వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి ఫామ్ లోకి వచ్చేసింది. ఆరంభంలో నిరాశపరిచిన సీఎస్కే ఇప్పుడు వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన వేళ ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. అటు కార్తీక్ శర్మ కూడా మెరుపులు మెరిపించాడు. తద్వారా ఈ సీజన్‌లో చెన్నై ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఢిల్లీ, మే 5 : వర్షం కురవడంతో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఊహించినట్టుగానే ఆరంభంలో పిచ్‌పై పరుగులు చేసేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. దీనిని సద్వినియో గం చేసుకున్న చెన్నై బౌలర్లు వరుస వికెట్లతో ఢిల్లీపై ఒత్తి డి పెంచారు. నిస్సాంక (19), రాహుల్ (12), నితీశ్ రాణా (15), కరుణ్ నాయర్ (13), అక్షర్ పటేల్ (2) పరుగులకే ఔటయ్యా రు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 69 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.
కనీసం 120 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. ఈ దశలో స్టబ్స్, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సమీర్ రిజ్వీ ఢిల్లీని ఆదుకున్నారు. వీరిద్దరూ కీలక పార్టనర్ షిప్ నెలకొల్పారు. ధాటిగా ఆడిన వీరి జోడీ ఆరో వికెట్‌కు 47 బంతుల్లో 65 పరుగులు జోడించింది. 31 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసిన స్టబ్స్‌ను ఓవర్టన్ ఔట్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత అశు తోశ్ శర్మ 14 పరుగులకు ఔటవగా.. రిజ్వీ దూకుడు కొనసాగించాడు.
చివరికి ఢి ల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 155 పరు గులు చేసింది. సమీర్ రిజ్వీ 24 బంతు ల్లో 4 సిక్సర్లతో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు తీయగా..అకిల్ హొస్సే న్, ముకేశ్ చౌదరీ, గుర్జప్ నీత్ సింగ్, ఓవర్టన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఆ రంభంలో ఓవర్‌కు ఆరు పరుగులే చేసినప్పటకీ చివర్లో దూకుడుగా ఆడిన ఢిల్లీ ఆరు ఓవర్లలో 78 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో ఢిల్లీ బౌలర్లు కాసేపు ప్రయత్నించినా చెన్నై ఓపెనర్ సంజూ శాంసన్ వారి ఆశలపై నీళ్లు చల్లాడు.
దూకుడుగా ఆడుతూ చెన్నైకి జోష్ ఇచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్ (6), ఉర్విల్ పటేల్ (17) పరుగులకే ఔటవగా.. చెన్నై 45 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సంజూ శాంసన్, కార్తీక్ శర్మ మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్ నిలబెట్టారు. కొద్దిసేపు ఆచితూచి ఆడిన తర్వాత సంజూ గేర్ మార్చాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. స్టార్క్ , ఎంగిడీతో పాటు ఢిల్లీ స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ల బౌలింగ్‌ను ఉతికారేశాడు. వీరిద్దరూ 65 బంతుల్లోనే 110 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు.
ఈ క్రమంలో మరో హాఫ్ సెంచరీ సాధించిన సంజూ భారీ సిక్సర్లతో అభిమానులను అలరించాడు. అటు కార్తీక్ శర్మ సైతం మంచి సపోర్ట్ ఇవ్వడంతో ఢిల్లీ బౌలర్లు ఒత్తిడి పెంచలేకపో యారు. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ మరో 15 బంతులు మిగిలుండగానే టార్గెట్‌ను అందుకుంది. సంజూ శాంసన్ 52 బంతుల్లో 87 (7 ఫోర్లు, 6 సిక్సర్లు) నాటౌట్, కార్తీక్ శర్మ 31 బంతుల్లో 41 (4 ఫోర్లు, 2 సిక్సర్లు) నాటౌట్ గా నిలిచారు. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది ఆరో ఓటమి.
స్కోరు బోర్డు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ : 155/7 ( రిజ్వీ 40 నాటౌట్, స్టబ్స్ 38, నిస్సాంక 19 ; నూర్ అహ్మద్ 2/22, ఓవర్టన్ 1/5, అకిల్ హొస్సేన్ 1/19)
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ : 159/2 (17.3 ఓవర్లు)( సంజూ శాంసన్ 87 నాటౌ ట్, కార్తీక్ శర్మ 41 నాటౌట్, ఉర్విల్ పటేల్ 17 ; అక్షర్ పటేల్ 1/25, ఎంగిడి 1/30 )






