15 August, 2026 | 3:57 PM

మహనీయుల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చేద్దాం

15-08-2026 03:23 PM

బోథ్. ఆగస్ట్ 15 (విజయక్రాంతి): దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారని వారి ఆశయాల కనుగుణంగా మనం ఐకమత్యంతో అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి స్వాతంత్ర ఫలాలను అందించాలన్నారు. ప్రతి పేదవాడికి స్వాతంత్ర ఫలాలు అందితేనే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అవుతుందన్నారు.

దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తూనే ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానన్నారు.. కాగా స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తాసిల్దార్ కార్యాలయంలో సుభాష్ చంద్ర ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రమేష్ పంచాయతీ రాజ్ డిప్యూటీ కార్యాలయంలో టి ఈ రాజేశ్వర్. మార్కెట్ కమిటీలు చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ. బోత్ బస్టాండులో కాంగ్రెస్ పార్టీ జెండాను కన్వీనర్ మెరుగు భోజన్న, గ్రామపంచాయతీలో సర్పంచ్ కురుమే అన్నపూర్ణ, సిపిఐ కార్యాలయంలో మండల పార్టీ కన్వీనర్ నరేష్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై పురుషోత్తం సిఐ గురుస్వామి జాతీయ జెండాలు నెరవేశారు.