15 August, 2026 | 4:01 PM

తండ్రి, కుమారుడి జ్ఞాపకార్థం విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్ల పంపిణీ

15-08-2026 03:19 PM

తండ్రి, కుమారుడి జ్ఞాపకార్థం విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్ల పంపిణీ అభినందనీయం : సర్పంచ్ అనంతుల శ్రీనివాస్ 

నూతనకల్ ఆగస్టు 15 : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని మిర్యాల గ్రామానికి చెందిన కనకటి నగేష్ తన తండ్రి కనకటి పాపయ్య, కుమారుడు కనకటి లోహిత్ జ్ఞాపకార్థం గ్రామంలోని విద్యార్థులకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాన్ని సర్పంచ్ అనంతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్లను, ఆటల పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను పంపిణీ చేశారు.విద్యార్థుల చదువుకు తనవంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నగేష్ తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అనంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ, తండ్రి మరియు కుమారుడి జ్ఞాపకాలను సేవా కార్యక్రమాల ద్వారా చిరస్థాయిగా నిలిపేందుకు కనకటి నగేష్ చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు.విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందించడం సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు.మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు.కనకటి నగేష్ చేపట్టిన సేవా కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు అభినందించారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ మెంచు కనకమల్లు,ఉపసర్పంచ్ అవిలయ్య, కనకటి పల్ల వెంకన్న, గుణగంటి వెంకన్న,ఇరుగు కిరణ్,చలిగంటి శ్రీశైలం,కొమ్ము పరమేష్,  చలిగంటి మల్లయ్య,ఇరుగు మల్లయ్య,అనంతుల మంగమ్మ,పాఠశాల ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.