రాజస్థాన్ పింక్ ప్రామిస్ జెర్సీ ఆవిష్కరణ
07-05-2026 01:11 AM
మహిళా సాధికారతకు మద్ధతు
జైపూర్, మే 6 : ఐపీఎల్ ఫ్రాంచైజీలు కేవ లం డబ్బు సంపాదనలోనే కాదు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడంలోనూ ముం దుంటున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయ ల్స్ ఫ్రాంచైజీ మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చింది.
ఈ క్రమం లో పింక్ ప్రామిస్ జెర్సీని ఆవిష్కరించింది. రాజస్థాన్‌లోని మహిళలకు ఉపాధి, విద్యుత్, నీటి వనరులను అందించే ఫౌండేషన్‌కు మ ద్ధతుగా ఈ నిర్ణయం తీసుకుంది. గుజరాత్ తో మే 9న జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ ప్లేయర్స్ ఈ జెర్సీ ధరించనున్నారు. స్థానిక రాజస్థాన్ మహిళలతో కలిసి రాజస్థాన్ హెడ్ కోచ్ సంగక్కర, కెప్టెన్ రియాన్ పరాగ్, పలువురు ఆటగాళ్లు ఈ జెర్సీని ఆవిష్కరించారు. అలాగే ఈ మ్యాచ్‌లో నమోదయ్యే ప్రతీ సిక్సర్‌కూ రాజస్థాన్‌లోని ఆరు ఇళ్లకు సౌరశక్తిని అందించనున్నారు.






