5 March, 2026 | 8:31 PM

సిఎస్ఆర్ నిధులను నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలి

05-03-2026 05:02 PM

బీటీపిఎస్ లో స్థానికులకు ఉపాధి కల్పించాలి

సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్  డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి

మణుగూరు, (విజయక్రాంతి): భద్రాద్రి పవర్ ప్లాంట్(Bhadradri Power Plant) సామాజిక  బాధ్యత సిఎస్ఆర్  నిధులను నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి వెచ్చించి, గ్రామాల సమూల అభివృద్ధికి సహకరించాలని, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్  డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. గురువారం  కలెక్టర్ మణుగూరు పర్యటన సందర్భంగా   కలిసి ఈ మేరకు  వినతిపత్రం అందజేశారు. అనంతరం మధుసూద న్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, బీటీపిఎస్ లో స్థానికులకు ఉపాధి 

కల్పించాలని, పవర్ ప్లాంట్ సిఎస్ఆర్ నిధులను నిర్వాసిత  గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీలు విద్యా, వైద్యం, విద్యుత్తు, త్రాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్లాంట్ నిర్మాణం కోసం నిర్వాసిత గ్రామాల ప్రజలు భూములు ఇచ్చి,నేడు దాని నుండి వెలువడే కాలుష్యాన్ని భరిస్తూ, ఇబ్బంది పడుతుంటే, నిర్వాసిత గ్రామాల అభివృద్ధి కోసం ఉపయోగించాల్సిన సిఎస్ఆర్ నిధులను అభివృద్ధికి ఉపయోగించ కుండా, బయటి ప్రాంతాలకు తరలించడంతో నిర్వాసిత గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని విమర్శించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు నిర్వాసిత గ్రామాల అభివృద్ధి పై దృష్టి పెట్టాలని, నిధులను నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి ఉపయోగించాలన్నారు. సిఎస్ఆర్ నిధుల వినియోగం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే, పార్టీ ఆధ్వర్యంలో కలిసి వచ్చే అందర్నీ కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.