6 July, 2026 | 2:00 AM

విద్యార్థులు ఆరోగ్యంపై దృష్టిసారించాలి

06-07-2026 12:57 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): విద్యార్థులు విద్యతో పాటు ఆరోగ్యంపై దృష్టిసారించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ఆదివారం జాతియ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, నవభారత్ సంయుక్త ఆధ్వర్యంలో భోలక్ పూర్ లోని ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ డాక్టర్లతో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభిం చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్  మాట్లాడుతూ దంత సంరక్షణతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్యతో పాటు అన్ని రంగాలలో రాణిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ సాహితి, డాక్టర్ హిమజ, డాక్టర్ ప్రియా, నవభారత్ స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు రఘు, కార్యదర్శి  వెంకటరమణ, ప్రముఖ సైకాలజిస్ట్ హిప్నొ పద్మాకమలాకర్, నిర్వాహకులు జయశ్రీ, సుఖన్య తదితరులు పాల్గొన్నారు.