సామాజిక ఉద్య మకారుడు, జాతీయ లోక్‌దళ్ పార్టీ అధ్యక్షుడు పుల్లూరి
జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్‌డీఎస్‌ఎఫ్) చైర్మన్, సుప్రీంకోర్ట్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్
ముషీరాబాద్, జులై 5 (విజయక్రాంతి): ప్రజాస్వామిక, సామాజిక పోరాటం యోధులు, ఎన్ డీ ఎస్‌ఎఫ్, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, భారత జాతీయ లోక్ దళ్ పార్టీ, జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పుల్లూరి వెంకట రాజేశ్వర్ రావు ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని కూటమి జాతీయ చైర్మన్, సుప్రీం కోర్ట్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ కొనియాడారు. ఆదివారం ఎన్ డి ఎస్‌ఎఫ్ జాతీయ కార్యాలయంలో జరిగిన పుల్లూరి సంస్మరణ సభలో ప్రంట్ చైర్మన్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ తో పాటు ఫ్రంట్ భాగస్వామ్య పార్టీ నేతలు పాల్గొని పుల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం వడ్లమూరి మాట్లాడుతూ ప్రజా రాజకీయాలలో పుల్లూరు వెంకట రాజేశ్వరరావు ముద్రవేశారని కొనియాడారు. ఆయన ఇచ్చిన రాజకీయ స్ఫూర్తితో ప్రజాస్వామిక సోషలిస్ట్ సెక్యులర్ రాజ్య స్థాపన కోసం ప్రజలను చైతన్యం పరచడానికి ఫ్రంట్ భాగస్వామ్య సంస్థలు సమా యాత్తం కావాలని వడ్లమూరి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఫ్రంట్ జాతీయ వర్కింగ్ చైర్మన్ జెట్టి ఏబెల్, దళిత బహుజన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పి. మోహన్ రావు, వంచిత్ బహుజన అగాడి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్, తెలంగాణ జనతా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎం. రాఘవన్, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క దేవేందర్ రావు, పుల్లూరి కుటుంబ సభ్యులు తల్లి సౌభాగ్యమ్మ, సోదరుడు శ్రీనివాస్ రావు, పద్మ, సోదరి మంజుల, పుల్లూరి కుమారుడు సంకీర్త్, బంధువులు తదితరులు పాల్గొన్నారు.






