లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్
హనుమకొండ, జూన్ 16(విజయ క్రాంతి): ఈ నెల 20వ తేదీ శనివారం జరిగే రెండవ జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ జాతీయ మెగా లోక్ ఆదాలత్ సంబందించి వరంగల్ కమిషనరేట్ పోలీసులు రూపొందించిన వాల్ పోస్టర్లను వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈ నెల 20తేది శనివారం రోజున రెండవ జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడదగిన కేసులలో ఉన్న క్రిమినల్ కంపౌండబు ల్ కేసులు, సివిల్ తగాదా కేసులు,ఆస్తి విభజన కేసులు,కుటుంబపరమైన కేసులు, వైవా హిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ వంటి కేసుల్లో కక్షిదారులు రాజీ పడే అవకాశం ఉంటుంది అని తెలిపారు.
రాజీయే రా జ మార్గమనీ,చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దన్నా రు. జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపా రు. జిల్లాలోని పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ లు, ఇతర పోలీస్ సిబ్బంది రాజీ పడ్డ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించడం జరుగుతుంది.
కావున ఎవరైనా తమ కేసులలో రాజీ కావాలి అ నుకున్నవారు పోలీస్ అధికారులకు సంప్రదించాల ని, లోక్ అదాలత్ ద్వారా బాధితుల కు సత్వరమే న్యాయం జరుగుతుంది అని పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఈ కార్యక్రమం వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఏసీపీ సత్యనారాయణ, సీఐ క్రాంతికుమార్, ఎస్‌ఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు.






