గొడ్డలి వేటుకు విలపిస్తున్న వృక్షాలు
రాత్రి వేళలో దర్జాగా అక్రమ కలప రవాణా
జెంగల్లో.. స్మగ్లర్ల దూకుడు..
కన్నెత్తి చూడని అటవీశాఖ అధికారులు..
స్మగ్లర్ల దూకుడుకు కళ్లెం పడేనా..?
బాన్సువాడ,(విజయ క్రాంతి): అటవీ ప్రాంతాల్లో చెట్ల నరికివేతతో వృక్షాలు వినిపిస్తున్నాయి. స్మగ్లర్ల గుడ్డలు వేటు తో పెద్ద పెద్ద చెట్లు నేల కొరకుతున్నాయి. రాత్రి వేళలో జరుగుతున్నాయి. అటవీ శాఖ అధికారులు తమకేమీ పట్టించుకోనట్టుగా వ్యవరించడంతో ఈ తతంగం కొనసాగుతుంది. స్మగ్లర్లు, అటవీశాఖ అధికారులు కలిసి కలప స్మగ్లింగ్ కు అవకాశం ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అటవీ ప్రాంతాలను కబ్జా గురైనప్పటికీ పట్టించుకోని అధికారులు, ఇటు అటవి సంపదను కూడా పట్టించుకున్న పాపను పోవడం లేదు. రాత్రి వేళల్లో చెట్లను నరకడం, టాక్టర్లలో డంపు చేయడం ఈ స్మగ్లర్లకు అలవాటుగా మారిపోయింది. అటు అటవీశాఖ అధికారులు కానీ, పోలీస్ శాఖ అధికారులు కానీ పట్టించుకున్న పాపాలు పోవడం లేదు. కల్ప తరలిపోతున్న వీరు ఆ దిశగా దృష్టి సారించలేం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్ని, బాన్సువాడ, కోనాపూర్, హనుమాజిపేట్, బడాపాడు, రుద్రూర్, ప్రాంతాల నుండి కల్ప స్మగ్లింగ్ జరుగుతున్నట్లు సమాచారం.
మండలంలో ఇటిక బట్టిలే టార్గెట్గా దర్జాగా దందా....
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరుడు ఈ వ్యాపకాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని కల్ప స్మగ్లింగ్కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పేరును చెప్పుకొని సదరు నాయకుడు తనకున్న వ్యాపాకాన్ని నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాజకీయ ముసుగుల జరుగుతున్న ఈ తతంగం అటవీ ప్రాంతాల్లో వృక్షాలను తెగ నరికేసే స్థాయికి వచ్చింది. అధికారులు పట్టించుకోకపోవడమా..? పోలీసు అధికారులు అటువైపుగా అదృష్ట సాధించకపోవడమా...? ఏదో ఏమో కానీ వీరి దందా మాత్రం కొనసాగుతోంది.
టేక్ అయిన కొట్టేస్తా...
అటవీ ప్రాంతాలలోని విలువైన టేకు, ఇతర చెట్లను కలప స్మగ్లర్లు ఇష్టం వచ్చినట్లు నరుకుతున్నారు. పట్టపగలే నెంబర్ ప్లేట్లు లేని బండ్లపై వచ్చి కలప దుంగలను కొడుతున్నారు. పగలు సేకరించిన కలపను అటవీ ప్రాంతాల్లోనే దాచి అర్థ రాత్రులు అక్రమంగా తరలిస్తున్నారు.
గత కొన్ని నెలలుగా ఈ తంతు సాగుతున్నప్పటికీ ఫారెస్ట్ ఆఫీసర్లు మాత్రం తమకేమీ పట్టదు అన్నట్లుగా వ్యవరిస్తున్నారు. ఫీల్డ్ వెరిఫికేషన్ కు దూరంగా ఉంటూ కార్యాలయాల్లోనే కాలక్షేపం చేస్తున్నారని అటవీ శాఖ అధికారులపై స్థానికులు మండిపడుతున్నారు.
కల్ప స్మగ్లింగ్ పై పట్టింపేది..?
విలువైన కలప నరికివేత అక్రమ రవాణాలో స్థానికంగా ఉన్న ఓ చోటా లీడర్ స్మగ్లర్ ను మించిపోయాడు. బిచ్కుంద మండలంలోని అన్ని గ్రామాలలో సంచరిస్తున్న ఓ కలప స్మగ్లింగ్ ముఠా దమ్ముంటే పట్టుకోండి అంటూ ఫారెస్ట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు సవాల్ విసురుతున్నారు. గత కొంతకాలంగా ఈ మండలంలో సంచరిస్తున్న ఈ ముఠా సభ్యులు విలువైన కలప దుంగలను రాత్రికి రాత్రే తరలిస్తున్నారు.
ఈ క్రమంలో కేవలం ఫారెస్ట్ భూముల్లోని చెట్లను మాత్రమే కాకుండా పొలాల వద్ద ఏపుగా పెరిగిన రైతులకు చెందిన టేకు చెట్లను సైతం నయానో బయానో చెల్లించిఎత్తుకెళ్తున్నారు. పొలం గట్ల వెంబడి పలువురు రైతులకు చెందిన ఏపుగా పెరిగిన కలప చెట్లను దుంగలుగ కొట్టి ఎత్తుకెళ్తున్నారు.
వన్యప్రాణులకు ముప్పు...
ఓవైపు ప్రభుత్వం వనమహోత్సవం పేరుతో అటవీ సంపదను పెంపొందించే ప్రయత్నం చేస్తుంటే కలప స్మగ్లింగ్ జీవనాధారంగా ఎంచుకున్న కొందరు ఇష్టం వచ్చినట్లు అడవుల నరుకుతున్నారు. దీంతో అడవుల నరికివేత వన్యప్రాణులకు ముప్పుగా మారింది. ఈ క్రమంలో ఆహారం నీరు దొరకక వన్యప్రాణులు సమీప గ్రామాలలోకి వస్తూ వేటగాళ్ల ఉచ్చులో పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో జింకలు, దుప్పులు వంటి వాటిని యువత కాపాడి ఫారెస్ట్ అధికారులకు అప్పచెప్పుతున్నారు. కానీ వెలుగులోకి రాకుండా వన్యప్రాణులు ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి.
కొరవడిన పర్యవేక్షణ...
అటవీ సంపద రక్షణ పట్ల ఫారెస్ట్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఫీల్డ్ వర్క్ కు దూరంగా ఉంటూ ఎక్కువ భాగం ఆఫీస్ పనులకే పరిమితమయ్యారన్న వాదనలు లేకపోలేదు. అడవుల నరికివేత వన్యప్రాణుల వేట వంటి తదితర విషయాల్లో ఎవరైనా సమాచారం ఇస్తే తప్ప దాడులు జరపడం లేదన్న అపవాదు మూటగట్టుకుంటున్నారు.
అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బిచ్కుంద మండలంలో గతంలో ఓ రెండు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అడవులను ధ్వంసం చేసి భూమి చదును చేశారు. అయితే ఇలాంటి ఘటనలు మండలంలో అనేక చోట్ల జరుగుతున్నాయని అటవీ సంపద రక్షణతో పాటు వన్యప్రాణులు, అటవీ భూముల సంరక్షణకు ఫారెస్ట్ అధికారులు మరిన్ని పటిష్ట చర్యలు చేపట్టాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.




