5 May, 2026 | 8:32 PM

Breaking News

మేక మన్వితను సన్మానించిన డీఈవో   •   క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •   ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •   నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •   గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం   •  

కుక్కర్ పేలుడుతో గాయపడ్డ మధ్యాహ్న భోజన వర్కర్‌

04-03-2026 07:41 PM

విధి నిర్వహణలో ప్రమాదం

బాధిత వర్కర్‌కు న్యాయం చేయాలంటూ సీఐటీయూ డిమాండ్

సిద్దిపేట రూరల్: నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన వర్కర్‌గా పనిచేస్తున్న పిడిశెట్టి నరసవ్వ ఇటీవల విధులు నిర్వహిస్తున్న సమయంలో పప్పు కుక్కర్ పేలి తీవ్రంగా గాయపడిన ఘటనపై సీఐటీయూ నాయకులు స్పందించారు. గత వారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నరసవ్వకు గాయాలయ్యాయి.

ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబాన్ని సీఐటీయూ జిల్లా నాయకులు చల్లారపు తిరుపతి రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు విద్యాధికారులు స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.తక్షణమే వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించి, బాధిత కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు.