అది ఫ్లాట్ కాదు.. పేకాట క్లబ్
జోరుగా మూడు ముక్కలాట
9మంది అరెస్ట్.. 62వేలు స్వాధీనం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లో ఓ కిలాడీ లేడీ, తన ఫ్లాట్‌లో పేకాట క్లబ్ నిర్వహిస్తూ రోజుకి లక్ష రూపాయలకు పైగా సంపాదిస్తుంది. వివరాల్లోకి వెళితే రాయదుర్గం పోలీ స్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారనే సమాచారం తో, సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు మంగళవారం పేకాట స్థావరంపై దాడిచేసి, ఓ మ హిళతో సహా 9మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 62 వేల నగదు, 11సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నా రు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ దుర్గం ఖాజాగూడలో ఉన్న ఏసీ అట్లాంటిక్స్ అపార్ట్‌మెంట్‌లో కొంతకాలంగా కమ్మంపాటి మాధవి అనే మహిళ అక్రమం గా మూడు ముక్కలాట నిర్వహిస్తుందన్నా రు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుం చి ఫంటర్స్‌ను పిలిపించి పెద్దఎత్తున గేమింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఆట కు రూ. వేయి ఆర్గనైజర్ ఫీజు వసూలు చేస్తూ, రోజు కి సుమారు 100కి పైగా గేమ్‌లను నిర్వహిస్తున్నదని పోలీసులు తెలిపారు. నిందితుల పై గేమింగ్ చట్టం కింద కేసు నమోదు చేసిన ఎస్వోటీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






