14 July, 2026 | 11:13 PM

2కిలోల గంజాయి పట్టివేత

01-05-2024 01:17 AM

ఎల్బీనగర్, ఏప్రిల్ 30 : నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రెండు కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కొలాటం వెంకట్‌సాయి(20) (సాయిబాబా కాలనీ, ఉప్పల్) ప్రైవేట్ ఉద్యోగి, బద్దితి సైమన్‌రాజ్(19) (విజయపురికాలనీ, ఉప్పల్) విద్యార్థి ఇద్దరు గంజాయికి అలవాటు పడి, దీనినే ఉపాధిగా మార్చుకున్నారు.

గంజాయి స్మగలర్ల నుంచి గంజాయి కొనుగోలు చేసి ఇతరులకు విక్రయ్తిన్నారు. నాగోలు మూసీ ప్రాంతంలో(లక్ష్మీనర్సింహస్వామి కాలనీ) వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో నాగోల్ ఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో అక్కడికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని నుంచి రెండు కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. వీరికి గంజాయి విక్రయిస్తున్న నరేశ్‌గౌడ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.