21 April, 2026 | 3:50 PM

Breaking News

జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు: మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   33% మహిళా రిజర్వేషన్ లో సామాజిక న్యాయం పాటించాలి   •   అభిమాని కుమారుడు కేశఖండనానికి వెళ్లిన ఎమ్మెల్యే   •   జీవన్ రెడ్డి.. పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. వెయ్యి ఏండ్లయినా BRS పార్టీ మారదు   •   విద్యార్థులకు మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారం అందించండి   •   ఘనంగా గ్రాడ్యుయేషన్ డే   •   రెండున్నరేళ్లలో రాష్ట్రం ఆగమైందనడం విడ్డూరం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   సిరిసిల్ల నుంచి మేడ్చల్ వరకు తెలంగాణ జాగృతి యువత పాదయాత్ర ప్రారంభం   •   ఏసీబీకి పట్టుబడిన ఆర్డీవో   •   పాతికేళ్ల అజ్ఞాతం అనంతరం సొంతూరుకు చేరిన ‘బడే’   •  

ఆన్‌లైన్‌లో మోసం.. వ్యక్తి పై సైబర్ క్రైమ్ కేసు

31-05-2025 01:01 AM

తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు

తుంగతుర్తి, మే 30, (విజయ క్రాంతి): ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకొని వోల్వో బస్సు డ్రైవింగ్ నేర్పించి మరియు డ్రైవర్ గా జాబ్ ఇప్పిస్తానని ఫోన్ కాల్ ద్వారా నమ్మించిన పల్నాడు జిల్లా మాచర్ల కు చెందిన వరప్రసాద్ అనే నిందితున్ని అరెస్టు చేయడం జరిగినది.

పిర్యాదు యొక్క తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 4,30,000/- రూ. తన ఫోన్ పే ఖాతా లోకి కొట్టించుకొని చాలా రోజూలుగా తప్పించికుంటూ పిర్యాది కి అబద్దపు మాటలు చెప్పి మోసపరచిన నిందితుడు పై నూతనకల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి పథకం ప్రకారం పట్టుబడి చేసి శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరిగినదని  తుంగతుర్తి సీఐ తెలిపినారు.

పట్టుబడిన విదానం:  ఉదయం పోలీస్ వారి సలహా మేరకు పిర్యాది నెరస్తుడికి ఫోన్ చేసి తను అడిగిన కొంత డబ్బులని సూర్యాపేట కి వస్తే ఇస్తా అని చెప్పగా నేరస్థుడు మాచర్ల నుండి సూర్యాపేట కి రాగా నేరస్తుడిని నూతనకల్ పోలీస్ సిబ్బంది సూర్యాపేట కొత్త బస్టాండ్ సమీపంలో ఉదయం 11.00 గంటల సమయంలో పట్టుబడి చేసి నూతనకల్ పోలీస్ స్టేషన్ కి తీసుకురాగా తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ. నరసింహ రావు  నేరస్తుడిని తుంగతుర్తి గౌరవ కోర్టు నందు హాజరు పరచి రిమాండ్ కి పంపించనైనది. తుంగతుర్తి సర్కిల్ ప్రజలు ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కోరారు.