21 April, 2026 | 5:11 PM

Breaking News

రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •  

రోడ్డు విస్తరణకు సహకరించాలి

31-05-2025 01:01 AM

ఎమ్మెల్యే తూడి మెఘా రెడ్డి  

వనపర్తి టౌన్, మే 30 : వనపర్తి పట్టణ భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రోడ్డు విస్తరణకు సహకరించాలని స్థా నిక శాసన సభ్యులు తూడి మెఘా రెడ్డి  కోరారు. రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న వ్యాపార సంస్థల యజమానుల తో శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి నిర్వహించిన సమావేశానికి శాసన సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడు తూ వనపర్తి పట్టణం నుంచి పెబ్బేరు రహదారి, పానగల్ రహదారి విస్తరణకు సంబంధించి వ్యాపారస్తులను ఇళ్ల యజమానులను ఇబ్బంది పెట్టి రోడ్డు విస్తరణ చేపట్టదలు చుకో లేదని, రోడ్డు విస్తరణను యజమానులను ఒప్పించి తగిన నష్ట పరిహారం ఇచ్చి విస్తరణ మాత్రం తప్పకుండా జరుగుతుందన్నారు. 

 పానగల్ రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్ రూమ్ కేటాయించడం లేదా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం వంటి సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి వనపర్తి -పెబ్బేరు రోడ్డు విస్తరణ  అనేది భావి తరాలకు, వనపర్తి గౌరవాన్ని కాపాడటానికి చాలా ముఖ్యమని అందువల్ల వ్యాపార స్తులు రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరారు.

వనపర్తికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని,  ఎక్కడ లేనివిధంగా సైఫాన్ డ్యామ్, చారిత్రాత్మక పాలిటెక్నిక్ కళాశాల ఇక్కడే ఉన్నాయన్నారు.రోడ్డు ఎన్ని ఫీట్లలో ఉండాలి అనేది ఇప్పటికే టౌన్ ప్లానింగ్ ద్వారా రూపొందించిన ప్రణాళికకు  అనుగుణంగా ఒకటి రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్  తో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. 

రోడ్డు ఒకే ప్లాట్ ఫాం పద్ధతిలో  వంకరలు లేకుండా అలన్మెంట్ ఉంటుందన్నారు. అద నపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మార్కెట్   కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు .

భగీరథుడి పట్టుదల అందరిలో ఉండాలి: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, మే 30 ( విజయక్రాంతి ) : గంగను దివి నుంచి భూమికి దింపిన మహా తపస్వి భగీరథుడని భగీరథుడి సహనం పట్టుదల ప్రతి ఒక్కరిలోనూ ఉండాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వనపర్తి పట్టణంలోని మర్రికుంటలో నూతనంగా ఏర్పాటుచేసిన ఏకశిల భగీరథ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. 

ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  భగీరథుడి పట్టుదల మనందరిలోన ఉండాలని మనం చేపట్టే పనులను పూర్తి చేసే వరకు వదిలిపెట్టకూడదని ఎమ్మెల్యే సూచించారు. తెలంగాణ ప్రభు త్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించబోతుందని అందులో సగరులకు సైతం రాజకీయపరమైన  అవకాశాలు రాబోతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వనపర్తి నియోజకవర్గంలో జిల్లా స్థాయి నామినేటెడ్ పదవికి మన సగర సోదరుడైన గోవర్ధన్ సాగర్ ను  నియమించామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హ యాంలో సగరులకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించిన ప్రభుత్వం ఏకైక కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో  సగర సంఘం నాయకులు పాల్గొన్నారు.