ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సైక్లింగ్ ర్యాలీ
ముకరంపుర, ఏప్రిల్ 7 (విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మంగళవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హెల్తీ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తారని, అహర్నిశలు కృషి చేస్తారని అన్నారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని, ఆహారపు అలవాట్లు సైతం మార్చుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రెనీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బంగారి స్వామి, కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కెప్టెన్ బి. మధుసూదన్ రెడ్డి, మహేందర్, ట్రాఫిక్ సిఐ బి.సంజీవ్, ట్రాఫిక్ ఎస్‌ఐ హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.




