1 August, 2026 | 1:36 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం... ఏపికి తుఫాన్

24-05-2024 11:28 AM

అమరావతి : ఆంధ్రప్రదేశ్ కు తుఫాన్ తరుముకొస్తోంది. నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా పయనిస్తూ ఏపి తీరానికి దూరంగా కదులుతోంది. నిన్న తీవ్ర అల్పపీడనంగా బలపడింది. శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముంది. ఆ తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ.. శనివారం ఉయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడనుంది. దీనికి రెమాల్ గా పేరు పెట్టారు. ఈ తూఫాను మరింత బలపడి ఉత్తర దిశాగా పయనించి పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాలకు చేరువై ఎల్లుండి సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారుతుంది.ఇవాళ ఏపిలో భారీ వార్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆది, సోమవారాల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, విజోరం, త్రిపుర, మణిపుర్ రాష్ట్రాల్లోని పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఏపి సహ  పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.  మరో వైపు అరేబియా సముద్రంలో కేరళ తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని ఐఎండి వివరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగా కదులుతున్నాయి. అరేబియా సముద్రం, మాల్దీవులు సహా పరిసర ప్రాంతాలకు విస్తరించాయి. ఈ నెలాఖరుకు కేరళను తాకుతాయని వాతావరణ శాఖ చెబుతుంది.