రేపే ఆరో దశ ఎన్నికల పోలింగ్
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో దశ ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. 8 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంల్లోని 58 స్థానాలకు శనివారం పోలింగ్ జరుగనుంది. అందవల్ల గురువారం సాయంత్రం ప్రచారానికి తెరపడింది. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులు చివరిరోజు కావడంతో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 8 రాష్ట్రాల్లోని 57 నియోజకవర్గాల్లో ఎల్లుండి పోలింగ్ నిర్వహించనున్నారు అధికారులు. 889 మంది అభ్యర్థులు ఆరో దశ ఎన్నికల బరిలో ఉన్నారు. హరియాణా, పంజాబ్, ఒడిశా, బెంగాల్ తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ కు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలో ఏడు లోక్ సభ స్థానాలకు ఒకేరోజు పోలింగ్ ఉండడంతో అందరి చూపు ఎర్రకోట వైపే ఉంది. మొత్తం 1.52 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 162 మంది అభ్యర్ధులు ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం 13 వేల పోలింగ్ కేంద్రాలను ఈసి ఏర్పాటు చేయగా.. దాదాపు లక్ష మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.






