3 May, 2026 | 2:23 AM

యాదగిరిగుట్టలో నిత్య కల్యాణం

03-05-2026 12:00 AM

5న హుండీ లెక్కింపు, నిత్యాదాయం రూ.40,25,206 

యాదగిరిగుట్ట, మే 2 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానంలో శనివారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వయంభూవులను మేల్కొలిపిన అర్చకులు సువర్ణ ప్రతిష్ఠ మూ ర్తులను వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషే కించి తులసీదళాలను అర్పించారు. ప్రాకార మంటపంలో నృసింహ హోమం, నిత్య కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. సా యంత్రం స్వామివారిని తిరువీధులలో ఊరేగించారు.

కొండపైన అనుబంధ ఆలయం అ యిన శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర ఆలయంలో ప్రతినిత్యం స్పటికలింగ దర్శనాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈ నెల 5 మంగళవారం రోజున హుండీ లెక్కింపు కొండ కింద వ్రతమంటపం హాల్ నెంబర్ 2లో జరుగుతుందని ఆలయ ఈవో భవాని శంకర్ ప్ర కటనలో తెలిపారు. అలాగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వివిధ శాఖల నుం చి నిత్యాదాయంగా రూ.40,25,206 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.