జనాగ్రహ సభ పేరు మార్పు
03-05-2026 12:00 AM
- ఆ పేరును తిరస్కరించిన పీఎంవో కార్యాలయం ..
- బహిరంగ సభ పేరుతోనే మోదీ సభ
- ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సభ
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తలపెట్టనున్న జనాగ్రహ సభ పేరును తొలగించారు. ఆ సభ పేరును పీఎంవో కార్యాలయం తిరస్కరించినట్లుగా తెలిసింది. ప్రధాని మోదీ బహిరంగ సభ పేరుతోనే సభను రాష్ట్ర బీజేపీ నాయకత్వం నిర్వహించనున్నది. అభివృద్ధి పనులకు రాష్ట్రానికి పీఎం వస్తుంటే జనాగ్రహ పేరు ఎందుకని పీఎంవో కార్యాలయం అభ్యంతరం తెలిపినట్లుగా తెలిసింది. కేంద్రపార్టీ సూచనలతోనూ సభకు జనాగ్రహ సభ పేరును రాష్ట్ర బీజేపీ తొలగించింది.






