18 July, 2026 | 12:26 PM

Breaking News

Vikram-1 రాకెట్ విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం

16-05-2026 08:56 PM

శివాలయంలో వారాంతపు ఆంజనేయునికి ఆకు పూజ ప్రారంభం

నిత్య ఆదాయం  29,40,771/-

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానంలో శనివారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు.  కొండపైన అనుబంధ ఆలయం అయిన శ్రీ పర్వత వర్దిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయము నందు శనివారం నుండి నూతనముగా వారాంతపు సేవ శ్రీ ఆంజనేయ స్వామి వారికీ ఆకు పూజ కార్యక్రమము వైభవంగా ప్రారంభించారు. ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించబడునని ఎవరైనా ఆకు పూజ నిర్వహించుకోదలచుకుంటే టికెట్ వెల 250/- గా నిర్ణయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

శ్రీ స్వామివారి ఆలయంలో  ఉదయం సుప్రభాత సేవతో స్వయంభూవులను  మేల్కొలిపిన  అర్చకులు గర్భగుడిలో కొలువు దీరిన స్వయంభులను సువర్ణ ప్రతిష్ట మూర్తులను వేదమంత్రోచరణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్పించారు. ప్రాకారమంటపంలో   నృసింహ హోమం, నిత్య కళ్యాణంను వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణమును చూచి భక్తులు భక్తి పారవశ్యంలో తేలిపోయారు. సాయంత్రం వెండి జోడు సేవ స్వామివారు తిరువీధులలో ఊరేగారు. శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయంలో ప్రతినిత్యం స్పటిక లింగ దర్శనని ఏర్పాటు చేశారు. స్వామివారి నిత్య రాబడి 29,40,771 శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కు వివిధ శాఖల నుండి వచ్చిన ఆదాయం 29,40,771/- వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.