15 July, 2026 | 6:37 PM

వైభవంగా స్వామివారి నిత్య పూజలు

15-07-2026 06:34 PM

స్వామివారి నిత్య రాబడి  14,15,625/-

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానంలో బుధవారం  నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు. శ్రీ స్వామి వారి ఆలయంలో  ఉదయం సుప్రభాత సేవతో  గర్భగుడిలో కొలువు దీరిన స్వయంభులను సువర్ణ ప్రతిష్ట మూర్తులను వేదమంత్రోచరణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్పించారు. ప్రాకారమంటపంలో   నృసింహ హోమం, నిత్య కళ్యాణంను వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణమును చూచి భక్తులు భక్తి పారవశ్యంలో  తేలిపోయారు. సాయంత్రం వెండి జోడు సేవ స్వామివారు తిరువీధులలో ఊరేగారు. శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయంలో ప్రతినిత్యం స్పటిక లింగ దర్శనo ను ఏర్పాటు చేశారు. .స్వామివారి నిత్య రాబడి 14,15,625/- వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.