15 July, 2026 | 6:26 PM

రోడ్డు ప్రమాదాల నివారణకై చర్యలు

15-07-2026 06:25 PM

R&B RTA, పోలీస్ శాఖ అధికారుల తనిఖీలు

రుద్రంగి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ప్రమాదకరంగా ఉన్న మూల మలుపులను జంక్షన్లను R&B, RTA పోలీస్ అధికారులు పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రమాదాలను తగ్గించేందుకు ఈ క్రింది చర్యలను వెంటనే చేపట్టాలని సంబంధిత శాఖలకు సూచించారు.

వాహనదారులకు స్పష్టంగా కనిపించే విధంగా హెచ్చరిక బోర్డులు, దిశా సూచిక బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేయడం. రాత్రి సమయంలో వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా తగిన వీధి విద్యుత్ దీపాలు (స్ట్రీట్ లైటింగ్) ఏర్పాటు చేయలని ఖ్లాగే రహదారిపై థర్మోప్లాస్టిక్ రోడ్ మార్కింగ్‌లు, స్టాప్ లైన్లు, జీబ్రా క్రాసింగ్‌లు అవసరమైన చోట వేయడం. జంక్షన్ వద్ద చెట్ల పొదలను అడ్డంకులను తొలగించి దృశ్యమానత మెరుగుపరచడం. అవసరమైతే స్పీడ్ కాల్మింగ్ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజల సహకారంతోనే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు పేర్కొన్నారు.