15 July, 2026 | 6:18 PM

Breaking News

వాసవి వరల్డ్ విద్యార్థి ప్రతిభ   •   తాడిచర్ల–2 బ్లాక్ విజయోత్సవంలో సింగరేణి డైరెక్టర్ పి&పి కె.వెంకటేశ్వర్లు   •   ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సమస్యలు చెప్పండి   •   మహంకాళి బోనాలకు రూ.1.50 లక్షల విరాళం ఇచ్చిన మైనారిటీ నాయకులు రఫీ   •   నెన్నెల పోలీస్ స్టేషన్‌ను డీసీపీ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ   •   ఆమ్దాపూర్ న్యూ పాఠశాల విద్యార్థులకు 135 స్కూల్ బ్యాగుల పంపిణీ   •   విద్యుత్ సమస్యల పరిష్కారం చేస్తాం..   •   నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలు   •   పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత   •   తెయూకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రతినిధులు   •  

తాడిచర్ల–2 బ్లాక్ విజయోత్సవంలో సింగరేణి డైరెక్టర్ పి&పి కె.వెంకటేశ్వర్లు

15-07-2026 06:13 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌కు మైనింగ్ లీజు మంజూరు కావడం సందర్భంగా నిర్వహించిన విజయోత్సవాల్లో భాగంగా, కొత్తగూడెం ఏరియాలోని పీవీకే–5 ఇంక్లైన్ మరియు RCHPలో  ప్రత్యేక కార్యక్రమాలు (బుదవారం) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ & ప్రాజెక్ట్స్) శ్రీ కె. వెంకటేశ్వర్లు, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేమ్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై ఉద్యోగులను అభినందించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ (పీ & పీ) కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తాడిచర్ల–2 బ్లాక్ సాధన సింగరేణి సంస్థ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. సంస్థ పురోగతికి ప్రతి ఉద్యోగి సమిష్టిగా కృషి చేయాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించే దిశగా అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. విజయోత్సవ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని తాడిచర్ల–2 బ్లాక్ మైనింగ్ లీజు సాధన పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జీఎం శ్రీ ఎం. షాలెమ్ రాజు గారు  మాట్లాడుతూ, తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ మైనింగ్ లీజు సాధనతో సింగరేణి సంస్థకు సుస్థిరమైన భవిష్యత్తు ఏర్పడిందన్నారు. సంస్థ అభివృద్ధి, కార్మిక సంక్షేమం, కొత్త బొగ్గు గనుల సాధన, ఉత్పత్తి వ్యయ నియంత్రణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, పునరుత్పాదక ఇంధన రంగంలో విస్తరణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, సంస్థ పురోగతికి కట్టుబడి ఉందని ఉద్యోగులకు వివరించారు.