15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సీఎం చెప్రాసీలుగా దళిత మంత్రులు!

23-02-2026 01:07 AM

క్రాంతి దల్ వ్యవస్థాపకుడు పృథ్వీరాజ్ 

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): కుమ్మెర గట్టు మల్లన్న దర్శనం కోసం వెళ్లిన బీసీ కుటుంబంపై రెడ్డి కులస్తులు దాడి చేసి, రెండు నెలల పసిపాప మృతికి కారణమయ్యారని క్రాంతిదళ్ వ్యవస్థాపకుడు పృథ్వీరాజ్ ఆరోపించారు. ఆదివారం బీసీ ఎస్సీ జేఏసీ చైర్మన్, మాజీ ఐఏఎస్ చిరంజీవులుతోపాటు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడుతూ..

ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు స్పందించినప్పటికీ ఆ వర్గాల చేత ఎన్నుకోబడిన దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీ ఎవరూ స్పందించడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సన్నిహితులు కుటుంబ సభ్యులే ఈ దాడిలో పాల్గొన్నారని అందుకే వారిపై చర్యలకు పోలీసులు వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎంపీ మల్లు రవి దళితుడే అయినప్పటికీ స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర దళిత మంత్రులు ముఖ్యమంత్రికి చెప్రాసీలుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు.