రాచమల్ల జగన్మోహన్‌కు దళిత రత్న అవార్డు
శంషాబాద్. ఏప్రిల్ 16(విజయక్రాంతి) : హైదరాబాద్,డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శంషాబాద్కు చెందిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చైర్మన్ రాచమల్ల జగన్మోహన్కు ప్రతిష్టాత్మక దళిత రత్న అవార్డు ప్రదానం చేశారు.హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ప్రభుత్వ ఉత్సవాల కమిటీ చైర్మన్ సుదర్శన్, కో-కన్వీనర్ శివకుమార్ తమ బృందంతో కలిసి ఈ అవార్డును అందజేశారు. సమాజంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి అంకితభావంతో సేవలందిస్తున్నందుకు గాను రాచమల్ల జగన్మోహన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, సమాజంలో వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న జగన్మోహన్ సేవలు అభినందనీ యం అన్నారు.






