30 June, 2026 | 2:06 PM

దైవచింతనతో మానసిక ప్రశాంతత

30-06-2026 01:30 PM

బోథ్,జూన్ 30(విజయక్రాంతి) : దైవచింతనతో మానసిక ప్రశాంతత నెలకొంటుందని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు. మంగళవారం నేరడిగొండ మండలం లోని రోడ్డు లకంపూర్ గ్రామంలో పోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి గావించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక మార్గం ఎంతోమంది ఆచరిస్తున్నారన్నారు. మనిషి తన దైనందిత జీవితంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు అన్నారు.అందుకు ధ్యానం అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గంగాధర్ మండల కన్వీనర్ శివారెడ్డి మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్ మాజీ జెడ్పిటిసి పండరి నేరడిగొండ సర్పంచ్ నీలిమ రవీందర్ రెడ్డి ఉపసర్పంచ్ గులాబ్ మాజీ ఉపసర్పంచ్ దేవేందర్ రెడ్డి సర్పంచ్ విజయ్ తో పాటు నాయకులు యాదవ్ సంతోష్ జాదవ్ ముత్యం తదితరులు పాల్గొన్నారు.