11 March, 2026 | 2:53 PM

Breaking News

కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •  

వాటర్ పైప్‌లైన్ ధ్వంసం

28-10-2024 12:22 AM

పోలీసులకు జలమండలి అధికారుల ఫిర్యాదు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 27(విజయక్రాంతి): ఓఅండ్‌ఎం డివిజన్ మణికొండ సెక్షన్‌లో గల 500 ఎంఎండయా డీఐ వాటర్ మెయిన్ పైప్‌లైన్ ధ్వంసానికి కారణమైన నస్రీన్ అనే వ్యక్తిపై జలమండలి స్థానిక మేనేజర్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఇంటికి సీవరేజీ కనెక్షన్ కోసం చేపట్టిన పనుల వల్లే ఇది జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్‌హెచ్‌వోను కోరారు. దీంతో పైప్‌లైన్ లీకేజీ ఏర్పడి నీరు వృథాగా పోతోందని, దాదాపు 820 ఇళ్లకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు. గండిపేట్ తహసీల్దార్ ఆఫీస్ తదితర ప్రాంతాలకు ఈ పైప్‌లైన్ ద్వారానే నీటి సరఫరా జరుగుతుందని అధికారులు చెప్పారు.