తెలుగువాళ్ల ప్రతిభను చాటే చిత్రం దండోరా
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘తెలంగాణ గద్దర్ అవార్డులు 2025’లో ‘దండోరా’ సత్తా చాటింది. మూడు కేటగిరీల్లో అవార్డుల్ని కొల్లగొట్టేసింది. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ నిర్మాణంలో మురళీకాంత్ ‘దండోరా’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు ముఖ్య పాత్రల్ని పోషించారు. తమ సినిమాకు ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు, ఇచ్చిన గుర్తింపు సందర్భంగా ఆదివా రం చిత్రయూనిట్ థాంక్స్ చెబుతూ మీడియా సమావేశం నిర్వహించింది.
ఈ థాంక్యూ మీట్‌లో శివాజీ మాట్లాడుతూ.. ‘మా ‘దండోరా’ సినిమాని గుర్తించి అవార్డుల్ని ఇచ్చిన జ్యూరీకి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ మూవీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఈ అవార్డుల్లో భాగం ఉంటుంది. తెలుగు వాళ్ల ప్రతిభను, సత్తాను చాటే చిత్రమిది. ఈ మూవీ ఇంకా చాలా దూరం వెళ్తుందని, మున్ముందు చాలా అవార్డులు వస్తాయ ని ఆశిస్తున్నాను‘ అన్నారు. దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ.. ‘మా ‘దండోరా’ సినిమాకు ఇలాంటి గుర్తింపు ఇచ్చిన జ్యూరీకి, ప్రభుత్వానికి థాంక్స్. ఇలాంటి అవార్డులు, గుర్తింపు వచ్చిన సమయాల్లోనే మన వద్ద ఉన్న టాలెంట్ గురించి అందరికీ తెలుస్తుంది. ఈ సినిమా చూసి ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్లు పర్సనల్‌గా ఫోన్ చేసి అభినందించారు.
నిర్మాత రవీంద్ర బెనర్జీ మాట్లాడుతూ .. “దండోరా’ సినిమాని గుర్తించి, అవార్డుల్ని ఇచ్చిన జ్యూరీ మెంబర్లకి, తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్. మా ‘దండోరా’ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్‘ అని అన్నారు. మార్క్ కే రాబిన్ మాట్లాడుతూ .. ‘ముందు నుంచీ మా సినిమాని సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్స్. మాకు ఈ గుర్తింపు, అవార్డుల్ని ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్. గద్దర్ అన్న పాటలు చిన్నప్పటి నుంచి వింటూ ఉండేవాడ్ని. ఈ రోజు గద్దర్ అవార్డుల్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా అవార్డ్ రావడం నాకు పెద్ద గౌరవం లాంటిది‘ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాస్ట్యూమ్ డిజైనర్ రేఖ, నటీనటులు నందు, నటి మనికా రెడ్డి కూడా మాట్లాడారు.




