calender_icon.png 27 June, 2025 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లామర్‌గా కనిపిస్తే తప్పేంటి?

03-06-2025 12:00:00 AM

వెండితెరపై గ్లామర్‌గా కనిపించడం తప్పెలా అవుతుంది? అంటూ ప్రశ్నించిన కథానాయికలు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఇదే ప్రశ్నను మాళవిక మేనన్ కూడా సంధిస్తోంది. తెరపై గ్లామర్‌గా కనిపిస్తూ దక్షిణాదిన తనకంటూ అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ మలయాళీ గ్లామర్ గురించి నెట్టింట ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. ఎందుకంటే ఈ బొద్దుగుమ్మ శరీర సౌష్టవానికి ఆకర్షితమై ఫాలో చేసే ఫ్యాన్స్ సంఖ్య కాస్త ఎక్కువే.

మాతృభాషలోనే కాకుండా తమిళ, తెలుగు ఇం డస్ట్రీల్లోనూ ఈ బ్యూటీని ఆరాధించేవారున్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో ఇప్పటికే తన లుక్‌ను చూసుకున్న ఈ భామకు ప్రస్తుతానికి టాలీవుడ్‌లో పెద్దగా ఛాన్సులు వస్తున్నట్టు లేదు. అందుకే కాబోలు వెండితెరపై చాలదన్నట్లు తరుచూ సోషల్‌మీడియాలో గ్లామర్ ఫొటోలు పోస్ట్ చేస్తూ యూత్‌కు నిద్రలేకుండా చేస్తోంది.

దీంతో ఇదంతా అవకాశాల కోసమేనా? అంటూ  తనను అడుగుతున్నారట. ఇదే విషయమై మాళవిక మేనన్ స్పందిస్తూ.. ‘మలయాళ చిత్రాల్లో గ్లామర్ పాత్రల్లో నటించే అవకాశం ఉండదు. తమిళ, తెలుగు భాషల్లో మాత్రం అలాంటి అవకాశాలు ఫుల్లుగా ఉంటాయి. అయినా గ్లామర్ పాత్రల్లో నటిస్తే తప్పేంటి? సోషల్‌మీడియాలో నా గ్లామరస్ ఫొటోల గురించి కూడా అడుగుతున్నారు.

నేను మాత్రమే అలా చేస్తున్నానా? అవకాశాల కోసం గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తున్నాననేది అబద్ధం. ఫేక్ అకౌంట్లతో నా గురించి ఉన్నవి, లేనివి ప్రచారం చేస్తున్నారు. అవాస్తవాలు రాస్తూ ముఖం చూపించడానికి భయపడేవాళ్ల గురించి పట్టించుకునే అవసరం నాకు లేదు” అన్నది.