9 May, 2026 | 2:41 AM

జక్కేపల్లి సోసైటీ చైర్మన్‌గా దారా జయశ్రీ

09-05-2026 01:40 AM

ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు

కూసుమంచి, మే 8(విజయక్రాంతి): కూసుమంచి మండలం జక్కేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా దారా జయశ్రీ ని సంఘం సభ్యులు ఎన్నుకున్నారు. సోసైటీ కార్యాలయంలో శుక్రవారం సభ్యుల సమావేశం జరిగింది.  సోసైటీకీ చైర్మన్ గా నల్లబోలు చంద్రారెడ్డి కొనసాగుతుండగా ఆయన ఇటీవలే సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందడంతో, ఆయన సొసైటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ప్రభుత్వం సహకార సంఘాలను రద్దు చేయగా, రైతు సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి.

కోర్టు నిర్ణయంతో సంఘాలు తిరిగి పునరుద్ధరించబడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఖాళీ అయిన చైర్మన్ పదవికి వైస్ చైర్మన్గా ఉన్న దళిత మహిళ దారా జయశ్రీని చైర్మన్గా ఎన్నుకున్నారు. అలాగే వైస్ ఛైర్మెన్ గా రామిని వీరభద్రారెడ్డి ని నియమించారు. అయితే దళిత మహిళకు ఈ అవకాశం రావడం పట్ల జక్కేపల్లి రైతులు అభినందనలు తెలిపారు. సొసైటీని సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. గతంలో ఇదే సొసైటీకి నల్లబోలు చంద్రారెడ్డిని ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నుకున్న విషయం తెలిసిందే. చైర్మన్ దారా జయశ్రీ మాట్లాడుతూ నన్ను డైరెక్టర్గా గెలిపించి, వైస్ చైర్మన్గా నియమించి, ఇప్పుడు చైర్మన్గా అవకాశం కల్పించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తాను అని తెలిపారు