భువనగిరి దవాఖానలో అంధకారం
23-05-2024 06:48 AM
డీజిల్ లేక స్టార్ట్ కాని జనరేటర్
యాదాద్రి భువనగిరి, మే 22 (విజయక్రాంతి): భువనగిరిలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో రోగులకు అవస్థలు తప్పలేదు. వైద్యులు చీకట్లోనే పేషంట్లకు చికిత్స చేయల్సి వచ్చింది. అయితే అత్యవసర పరిస్థితులలో, విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు వినియోగించేందుకు దవాఖానలో జనరేటర్ సౌకర్యం ఉన్నప్పటికీ డీజిల్ లేని కారణంగా జనరేటర్‌ను స్టార్ట్ చేయలేదని వైద్యులు తెలిపారు. విద్యుత్ పోయిన ప్రతిసారి భువనగిరి ఏరియా దవాకానలో ఇదే పరిస్థితి అని రోగులు మండి పడుతున్నారు.






