దశరథ్ సేవలు అభినందనీయం
01-03-2026 01:00 AM
యువ నాయకులు పెండల మల్లేష్ ముదిరాజ్
జిన్నారం /అమీన్ పూర్, ఫిబ్రవరి 28(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం డివిజన్ ఎస్‌ఐ దశరథ్ ఉద్యోగ విరమణ అభినందన సభను శనివారం బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువ నాయకులు పెండల మల్లేష్ ముదిరాజ్ వారి మిత్ర బృందంతో పాల్గొన్నారు. అనంతరం వారు ఎస్‌ఐ దశరథ్‌ని ఘనంగా పూలమాల, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఎస్‌ఐ తన శేషజీవితాన్ని కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు కుమార్, లింగం, నరసింహ ముదిరాజ్, రామకృష్ణ ముదిరాజ్ పాల్గొన్నారు.




