9 April, 2026 | 7:12 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ ప్రమాణం

17-04-2025 02:03 AM

హాజరైన బండా ప్రకాశ్, కేటీఆర్, హారీశ్‌రావు తదితరులు

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్‌ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన చాంబర్‌లో శ్రవణ్‌కుమార్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఙతలు తెలిపారు. ఎమ్మెల్సీగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతానన్నారు. కాంగ్రెస్ దుర్మార్గ పాలనను అంతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.