calender_icon.png 29 May, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతితో డేటింగ్.. విదేశాలకు జంప్

28-05-2025 12:54:05 AM

ఎయిర్‌పోర్టులో అరెస్ట్

రాజేంద్రనగర్, మే27: యువతితో డేటిం గ్ చేసిన ఓ యువకుడు విదేశాలకు పారిపోయాడు. యువతి ఫిర్యాదుతో లుకౌట్ నోటీ సులు జారీ చేసిన పోలీసులు.. మంగళవా రం విదేశాల నుంచి తిరిగి వస్తుండగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో యువకుడిని అరెస్టు చేశారు. హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన యువతికి బెంగుళూరులో శశాంక్ వేలూరితో కొన్ని రోజు ల క్రితం పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.

ఉన్నత చదువుల కోసం యూకే వెళ్తున్నానని.. కొన్నాళ్ల తర్వాత పెళ్లిచే సుకుని తీసుకెళ్తానని యువతిని నమ్మించాడు. యూకే వెళ్లిన తర్వాత అతడు ప్రేయసి సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేశాడు. మోసపోయానని గ్రహించిన యువతి 2023 డిసెంబర్‌లో ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.