calender_icon.png 29 May, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంకేతిక కారణాలతోనే ఆర్టీసీ పోస్టుల భర్తీ ఆలస్యం

28-05-2025 12:56:07 AM

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): ఆర్టీసీలో 3,036 రెగ్యూలర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, సాంకేతిక కారణాల వల్ల నియామక ప్రక్రియలో జా ప్యం జరుగుతోందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగం పల్లిలోని టీజీఎస్‌ఆర్టీసీ కళాభవన్‌లో రాష్ర్టస్థాయి ఎంప్లాయ్ వెల్పేర్ బోర్డు సభ్యులతో ఆర్టీసీ ఎండీ మంగళవారం సమావేశమయ్యారు.

ఐదారు నెలలుగా కొందరు రెచ్చ గొట్టే విధంగా మాట్లాడుతున్నా, ఉద్యోగులు సంయమనం పాటించారని తెలిపారు. ఆర్టీ సీ ఉన్నతాధికారుల తో కలిసి వెల్పేర్ బో ర్డు సభ్యుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రిక్ బస్సు లను రాష్ర్ట ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ కొనుగోలు చేసేలా అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు.

యాజమాన్యం తీసుకునే నిర్ణయాల వెనుక ఉద్యో గుల, సంస్థ ప్రయోజనాలే ఉంటాయని, ప్రతి నిర్ణయం పారదర్శకంగానూ, సంస్థ నిబంధనలకు లోబడే ఉంటుందన్నారు.

విధి నిర్వహణలో మరణించిన 2350 మంది సిబ్బంది కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలను కల్పించామని వివరించారు. మెడికల్ అన్ ఫిట్ అయిన మరో 537 మందికి ఉద్యోగాలిచ్చామని వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, ఖుష్రోషా ఖాన్, సొలోమన్, వెంకన్న, రాజశేఖర్, ఫైనాన్స్ అడ్వుజర్ విజయపుష్ప, హెచ్వోడీలు పాల్గొన్నారు.