calender_icon.png 29 May, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పథకాలు లబ్ధిదారులకు మేలు చేయాలి

28-05-2025 12:50:02 AM

  1. కేంద్ర ప్రభుత్వం నిధుల పథకాలపై ప్రచారం చేయండి 

దిశ సమావేశంలో ఎంపీ డీకే అరుణ

మహబూబ్ నగర్ మే 27 (విజయ క్రాంతి) : అభివృద్ది పనులు,పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు చెరే విధం గా అధికారులు  సక్రమంగా అమలు చేయాలని మహబూబ్ నగర్ ఎంపి,దిశ  చైర్ పర్స న్ డి కే.అరుణ అన్నారు. మంగళవారం స మీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్) లో జిల్లా అభివృద్ది,పర్యవేక్షణ క మిటీ(దిశ)డి.కె అరుణ అధ్యక్షతన  నిర్వహిం చి జిల్లాలో కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలు,అభివృద్ది కార్యక్రమాలు సమీక్షించారు.

కేంద్రం ప్రభుత్వం నిధులతో రాష్ట్ర ప్ర భుత్వ వాటా నిధులతో వివిధ పథకాలు ఎటువంటి లోపాలు లేకుండా నిరుపేదలకు, సన్న,చిన్న కారు రైతులకు ప్రయోజనం కలిగేలా పర్యవేక్షించి పకడ్బందీగా అమలు చే యాలని అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ,వైద్య ఆరోగ్య శాఖ, మార్కెటింగ్, విద్యాశాఖ, విధ్య సంక్షేమం,మౌలిక వసతుల అభివృద్ది సంస్థ,పౌర సరఫరాల శాఖ, పశు సంవర్థక శాఖ,అటవీ శాఖ,విద్యుత్ శాఖ,మ హిళా శిశు సంక్షేమం,గిరిజన అభివృద్ది శాఖ ల ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాలు సమావేశంలో సమీక్షించారు.

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా వ్యవసాయ యంత్రీకీకరణ పరికరాలు 50 శాతం సబ్సిడీ పై  పంపిణీ చేయుటకు  252 యూనిట్ లకు  72 లక్షల 20 వేల రూ.లు నిధులు కేటాయించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి వి వరించారు.ఇందులో 13 రకాల వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇందులో జనరల్ కేటగిరికి 53, 65,548,ఎస్.సి.11,05,852, ఎస్.టి.కి 6, 48,700 రూ.లు కేటాయింపు చేశారని తెలిపారు. 

అర్హులైన లబ్దిదారులను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎటువంటి రాజకీయ జోక్యం, ఒత్తిడులు లేకుండా ఎంపిక చేయాలని సూచించారు.జిల్లా కలెక్టర్ స్పందిస్తూ మండల స్థాయిలో,జిల్లా స్థాయిలో ఎంపిక కమిటీ లు ఏర్పాటు చేయాలని,మండల స్థా యిలో పరిశీలన తర్వాత జిల్లా కమిటీకి  ఎం పిక కు పంపాలని ఆదేశించారు. జిల్లాలో డి. ఎం.ఎఫ్  నిధుల ద్వారా  ప్రధాన మంత్రి క్షే త్ర కళ్యాణ యోజన  పథకం  అమలు,

గనుల వివరాల సేకరణ..

జిల్లాలో  మామిడి పండ్లు ద్వారావా ల్యూ ఆధారిత ఉత్పత్తులు కు ఉద్యాన శాఖ, పరిశ్రమల శాఖలు ప్రణాలికలు రూపొందించాలని అన్నారు. మున్సిపాలిటీ లలో అమృ త్ తదితర పథకాల పై సమీక్షించారు.

ఈ స మావేశం లో జిల్లా కలెక్టర్ విజయేందిర బో యి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంధ్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్,డి.అర్.డి. ఓ నర్సింహులు,వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా కె.కృష్ణ,జిల్లా సహకార అధికారి శంకరా చారి,జిల్లా అటవీ అధికారి సత్య నారాయణ,గనుల శాఖ సహాయ సం చాలకులు సంజయ్ కుమార్ పాల్గొన్నారు.