18-10-2025 06:06:09 PM
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): జిల్లాలో వేములవాడలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని బర్దిపూర్ (సంగారెడ్డి జిల్లా) కు చెందిన శ్రీ శ్రీ శ్రీ దత్తగిరి మహారాజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి రాగానే ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వస్తి వచనాలతో స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం కళ్యాణ మండపంలో స్వామివారి శేష వస్త్రం, లడ్డు ప్రసాదాన్ని ఆలయ అధికారులు మహారాజ్ అందజేశారు. వారి వెంట ప్రోటోకాల్ సహాయ కార్యనిర్వహణ అధికారి జి అశోక్ కుమార్ ఆలయ పర్యవేక్షకులు రాజేందర్ ఆలయ అర్చకులు వేద పండితులు ఉద్యోగులు ఉన్నారు.