calender_icon.png 19 October, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారుల ఆదేశాలతో పని ఏంటి..

18-10-2025 06:04:24 PM

తన పనికి ఎవరు అడ్డు వస్తారు..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): అధికారుల ఆదేశాలతో నాకేం పని అంటూ, తన పనికి ఎవరు అడ్డు వస్తారో చూస్తానన్నట్లుగా సాగుతోంది హెచ్ కన్వెన్షన్ రోడ్డు వివాదం. కోర్టులో తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో కోర్టు రోడ్డును వినియోగించుకోవాలంటూ తీర్పు ఇచ్చినట్లు సమాచారం. ఆ ప్రబుద్ధుడు సదరు కోర్టు ఆదేశాలను వక్రీకరించి రోడ్డును అభివృద్ధి పనులు చేపట్టారు. విషయం తెలిసి రెవెన్యూ అధికారులు అడ్డగించినప్పటికీ నా పనికి అడ్డుస్తారా అన్నట్లు రోడ్లు విస్తరణ ఏదేచ్ఛగా చేపట్టారు. ఎంత జరుగుతున్న జిల్లా రెవెన్యూ అధికారుల్లో చలనం రాకపోవడం మండల పట్టణ ప్రజలను విష్మయానికి గురిచేస్తుంది. రోడ్డు అభివృద్ధి పనుల విషయాన్ని తాసిల్దార్ ధారా ప్రసాద్ ను వివరణ కోరగా తమ సిబ్బందిని పంపి నిలుపుదల చేస్తామన్నారు.