calender_icon.png 19 October, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి స్పష్టం చేయాలి

18-10-2025 06:08:54 PM

సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్..

కరీంనగర్ (విజయక్రాంతి): 42 శాతం బీసీలకు రిజర్వేషన్ల అంశంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వైఖరి స్పష్టం చేయకపోవడం దుర్మార్గమని, ఆ పార్టీని బీసీలు నమ్మవద్దని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. శనివారం బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ లో సిపిఐ పార్టీ తెల్లవారుజామున బస్టాండ్ వద్ద బీసీ సంఘాలతో కలిసి బంద్ లో పాల్గొని ఈ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి అటు అసెంబ్లీలో ఇటు బయట ప్రకటించి దాన్ని అమలు చేసే దిశగా అసెంబ్లీలో అందరి ఆమోదం తెలిపితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుందని, రిజర్వేషన్ల ఫలాలు బీసీలకు దక్కాలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యుల్ లో చేర్చాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, కసిరెడ్డి మణికంఠ రెడ్డి,నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, కటికరెడ్డి బుచన్న యాదవ్, బామండ్ల పెల్లి యుగేందర్, బీర్ల పద్మ, మచ్చ రమేష్, రామారపు వెంకటేష్, నాయకులు చెంచల మురళి, మామిడిపల్లి హేమంత్ కుమార్, కేశబోయిన రాము, మాడిశెట్టి అరవింద్, కనకం సాగర్, తదితరులు పాల్గొన్నారు.