23-12-2025 09:18:06 AM
రూ 5 లక్షల నగదు, 4 తులాల బంగారం అపహరణ
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచ పట్టణ పరిధిలోని జనసంచారం ఉండే ప్రాంతమైన ఘట్టాయిగూడెంలో తాళం వేసిన ఇంట్లోకి చొరబడి భారీ దొంగతనానికి పాల్పడ్డాడు. గట్టాయిగూడెం ఏడవ వార్డు లోనే సాయిరాం వీధిలో నివాసముండే కేటీపీఎస్ ఉద్యోగి కొల్లూరు తులసీదాస్ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. తులసిదాస్ తన అత్తగారి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా భద్రాచలం వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండటం చూసి నిర్గ్రాంతపోయారు. లోపలికి వెళ్లే పరిశీలించగా బీరువాలో ఉన్న రూ 5 లక్షల నగదు, 4 తులాల బంగారు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు.
సీసీ టీవీలో దొంగతనం జరిగిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. సి సి ఫుటేజీని పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దొంగ ఇంటి వెనక గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. ఇంటి తాళం పగలగొట్టిన తర్వాత అక్కడ సిసి కెమెరాలు ఉండటానికి గమనించిన దొంగ తన ముఖం పడకుండా వాటిని పక్కకు తిప్పేశాడు. బీరువాలోని నగదు బంగారం మూట కట్టుకున్న, దొంగ వెలుతు వెళ్తూ ఇంట్లో ఉన్న స్కూటీ తాలాన్ని కూడా తీసుకెళ్లాడు. ఏంటి యజమాని రాత్రి కూడా రానీ ఎడల స్కూటీని కూడా తీసుకెళ్లేవాడు. సి సి ఫుటేజీని పరిశీలించిన పోలీసులు దొంగని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. బాధితుడు తులసిదాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాల్వంచ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.