23-12-2025 09:56:01 AM
హనుమకొండ,(విజయక్రాంతి): ఎన్జీవోస్ కాలనీలో నూతనంగా ఏర్పాటుచేసిన ఆరోగ్య సంరక్ష ,మద్యపాన- మాదకద్రవ్య వ్యసన విముక్తి చికిత్స మరియు పునరావాస కేంద్రాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మద్యపానం ఆరోగ్యానికి హానికరమని,యువత చెడు అలవాట్లకు,తాగుడుకు దూరంగా ఉండాలన్నారు. ఎవరైనా మద్యపానానికి బానిస అయినట్లయితే విముక్తి కోసం యువకుడు రాకేష్ ఏర్పాటు చేసిన మద్యపాన విముక్తి కేంద్రం ఉపయోగపడుతుందని అన్నారు.అనంతరం ఎమ్మెల్యేను రాకేష్ దంపతులు శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఫౌండర్ బంక రాకేష్ యాదవ్, డాక్టర్ వైదిక శశాంక్, హనుమకొండ జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్, హనుమకొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వరంగల్ పార్లమెంటు ఇంచార్జ్ ఎండి ముస్తాక్ నేహాల్, ఫిషర్ మెన్ కాంగ్రెస్ స్టేట్ డైరెక్టర్ మండల సమ్మయ్య, 57,58 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బంక సతీష్ యాదవ్, సుధాకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాళ్ల పెళ్లి మేరీ, తాళ్ల పెళ్లి రవీందర్, జనగాం శ్రీనివాస్ గౌడ్,ప్రసాద్, రాకేష్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.