హిందూ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుందాం
తాడ్వాయి,(విజయక్రాంతి): హిందూ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుందామని సద్గురు మహాదేవ్ స్వామీజీ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మా గార్డెన్ లో శనివారం ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హిందూ ధర్మం ఎంతో పవిత్రమైందని దీని కాపాడుకోవడానికి ప్రతి హిందూ కృషి చేయాలని తెలిపారు. హిందూ అంటేనే ప్రపంచంలో ఒక మంచి గుర్తింపు ఉందని హిందూ బంధువులంతా ఏకతాటిపై నిలబడాలని సూచించారు.
వక్త గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... హిందువులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని హిందువుగా పుట్టడమే మనం చేసుకున్న పుణ్యమని తెలిపారు. మన సాంప్రదాయాలను పాచ్చాత్య దేశాల వారు ఆచరించడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. మన ఆచారాలు కాపాడుకుని మన ధర్మాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు, ప్రతినిధులు పాల్గొన్నారు.




